జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారాలోని కేరన్ సెక్టార్‌లో చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం మేరకు నవంబర్ 7న సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయి. అనంతరం దళాలు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. దీంతో ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మరొక ఉగ్రవాది నక్కి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన దగ్గర నుంచి సైన్యం నిఘా పెంచింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను కూడా సైన్యం హతమార్చింది. ప్రస్తుతం ఎలాంటి చొరబాట్లు జరగకుండా సైన్యం కట్టడి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మే 7న పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు
