NTV Telugu Site icon

Phulwari Sharif PFI case: ఫుల్వారీ షరీఫ్ పీఎఫ్ఐ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. టార్గెటెడ్ కిల్లింగ్స్‌కు ప్లాన్

Nia

Nia

Phulwari Sharif PFI case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పీఎఫ్ఐ ఉగ్రసంస్థ ఫుల్వారీ షరీఫ్ కేసులో మరో ఇద్దరిని బీహార్ లో అరెస్ట్ చేశారు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పిఎఫ్‌ఐకి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన తన్వీర్ రజా అలియాస్ బర్కతి, మహ్మద్ అబిద్ అలియాస్ ఆర్యన్ అనే ఇద్దరు వ్యక్తులను మోతిహరీ ప్రాంతంలో ఎనిమిది చోట్ల దాడులు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిద్దరు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేసేందుకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సమకూర్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Manik Rao Thakre : రేపటి నుంచి తెలంగాణ హాత్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రలు

దీనికి ముందు ఈ కేసులో మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మతసామరస్యానికి భంగం కలిగించేలా పీఎఫ్ఐ ప్లాన్ ను ఛేదించినట్లు ఎన్ఐఏ ప్రతినిధి వెల్లడించారు. గతేడాది జూలై 12 పాట్నాలోని పుల్వారీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎఫ్ఐ మాడ్యుల్ వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు దేశంలో అశాంతి చెలరేగేలా, చట్ట విరుద్ధమై కార్యకలాపాలకు పాల్పడేందుకు ఫుల్వారీ షరీఫ్ లో సమావేశం అయిన సందర్భంలో పోలీసులు ఈ మాడ్యుల్ ను చేధించారు.

ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పేల్చేలా పీఎఫ్ఐ కార్యకర్తలకు ట్రైనర్ యాకూబ్ శిక్షణ ఇస్తుండే వాడు. శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో యాకూబ్ ఫేస్‌బుక్‌లో అవమానకరమైన, రెచ్చగొట్టే వీడియోను పోస్టులు చేసేవాడు. యాకూబ్ తో పాటు ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులు, ఫేస్ బుక్ లో వారి పోస్టులను ట్రోల్ చేసినవారిలో కొందరిని గుర్తించి చంపడానికి కుట్ర పన్నారు. అయితే ప్రస్తుతం యాకూబ్ పరారీలో ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Show comments