Site icon NTV Telugu

Teacher Eligibility Test: టెట్‌పై సుప్రీంకోర్టులో పిల్.. సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన ద్విసభ్య ధర్మాసనం

Supreme Court

Supreme Court

Teacher Eligibility Test: దేశవ్యాప్తంగా 6–14 సంవత్సరాల పిల్లలకు విద్యనందిస్తున్న అన్ని పాఠశాలల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) పరిధికి రిఫర్ చేసింది. దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో టెట్ పూర్తి చేసిన వాళ్లే ఉపాధ్యాయులుగా ఉండాలని, ఏ విద్యా సంస్థకు మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న లా స్టూడెంట్ నితిన్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Read Also: Priyadarshi : నన్నెందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాలేదు!

మైనారిటీ నిర్వహణలో ఉన్న విద్యాసంస్థలను రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం పరిధి నుండి మినహాయించడం ఆర్టికల్ 14, 15, 16, 21, 21A ప్రకారం ఉన్న సమానత్వం, విద్య హక్కుల ఉల్లంఘన అని పిటిషన్ లో పేర్కొన్నారు. RTE చట్టంలోని సెక్షన్ 1(4), 1(5)లను యాదృచ్ఛికమైనవి, వివక్షతాత్మకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు పిటిషనర్. ఆర్టికల్ 21A ప్రకారం అందరికీ సమాన నాణ్యమైన విద్య హక్కు ఉంది. కాబట్టి కొన్ని పాఠశాలలను TET నుంచి మినహాయించడం రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం, అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆర్టికల్ 30 (మైనారిటీలకు విద్యాసంస్థలు స్థాపించే హక్కు)ను సమానత్వం దిశగా అర్థం చేసుకోవాలి, నిబంధనగా కాకుండా అని నితిన్ ఉపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. అలాగే, జాతీయ బాలహక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) 2021 అధ్యయనం ప్రకారం, మైనారిటీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కేవలం 8.76% మంది మాత్రమే సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారని పిటిషన్ లో ప్రస్తావించారు. Anjuman Ishaat-E-Taleem Trust vs. State of Maharashtra కేసును ఉదహరిస్తూ, అన్ని పాఠశాలల్లో TETని ఏకరీతిగా అమలు చేయడం ద్వారా విద్యా నాణ్యత పెరిగి, దేశ ప్రయోజనం సాధ్యమవుతుందని పిటిషన్ పేర్కొంది.

14 సంవత్సరాల లోపు పిల్లలకు సాధారణ విద్యా వ్యవస్థను అమలు చేయడం ద్వారా దేశంలో సమాన సంస్కృతి, అసమానతల తొలగింపు, వివక్షత విలువల తగ్గింపు సాధ్యమవుతుందిఅని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. నితిన్ వేసిన పిల్ మొదట జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏ.జీ. మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే,పిటిషన్‌లో చట్టపరమైన ప్రశ్నలు ఉన్నాయని. ఇప్పటికే ఇలాంటి పిటిషన్లపై లార్జర్ బెంచ్ లలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ కు రిఫర్ చేశారు..

Exit mobile version