NTV Telugu Site icon

Karnataka: కారులో నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనం..

Young Couple

Young Couple

ప్రేమించడం గొప్పకాదు.. కలిసి బతకడం గొప్ప అని చెబుతారు.. కానీ, కొన్ని ఘటనలు చూస్తుంటే.. కొందరు ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటుంటే.. కొందరు నా ప్రేమను అంగీకరించలేదని హత్య చేస్తున్నారు.. ఇక, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారిని కూడా వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు తీస్తున్నారు.. తాజాగా కర్ణాటకలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. కారులో పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

Read Also: AP: సర్కారువారిపాట సీన్ రిపీట్… ఈఎంఐలు కట్టలేక ఏం చేశాడంటే..?

బెంగళూరు సుల్తాన్‌పాళ్యకు చెందిన యశవంత్‌ యాదవ్‌ , మనోరాయనపాళ్యకు చెందిన జ్యోతి కొన్ని సంవత్సరాల నుంచి లవ్‌లో ఉన్నారు.. జ్యోతి బీకాం పూర్తిచేయగా.. యశవంత్‌ కంప్యూటర్‌ కోర్స్‌ నేర్చుకున్నాడు.. ఈ నెల 18న ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు.. రెండురోజులైనా తిరిగిరాకపోవడంతో హెబ్బాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. ఇక, ఆ ప్రేమ జంట మంగళూరుకు వెళ్లి తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగారు.. ఆ తర్వాత ఓ వ్యక్తి నుంచి కారును అద్దెను తీసుకుని ఉడుపికి వెళ్లారు. ఉడుపిలో వివిధ దేవస్థానాలను సందర్శించారు.. ఆదివారం వేకువజామున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రేమికులు.. దీంతో, తన సోదరునికి యశవంత్‌ మెసేజ్‌ పెట్టాడు.. తర్వాత ఆ ప్రేమ జంట కారులోనే ఉండి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.. క్షణాల్లో కారుమొత్తం మంటలు వ్యాపించి.. గ్యాస్‌ సిలండర్‌ పేలిపోవడంతో యశవంత్‌ శరీరం బయటకు ఎగిరిపడగా.. జ్యోతి కారులోనే కాలిపోయింది. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు పెట్టారు. అయితే, తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు.