Site icon NTV Telugu

Jharkhand: బాలిక‌పై లైంగిక దాడి.. యువ‌కుల‌కు నిప్పంటించిన గ్రామ‌స్తులు

Mainor Gils

Mainor Gils

అమాయ‌క బాలిక‌ల‌పై లైంగిక దాడులు జ‌రుగుతూనే వున్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న బాలిక‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. ఓ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఇద్ద‌రు యువ‌కుల‌కు గ్రామస్తులు నిప్పంటించిన ఘ‌ట‌న జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది.

ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. స‌దార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక‌పై ఇద్ద‌రు యువ‌కులు బుధ‌వారం రాత్రి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఇద్ద‌రు యువ‌కుల‌ది ప‌క్క గ్రామం. అయితే త‌న ప‌ట్ల జ‌రిగిన లైంగిక‌దాడిని బాలిక త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీంతో మైన‌ర్ పేరెంట్స్, స్థానికులు క‌లిసి ప‌క్క గ్రామంలోకి యువ‌కులిద్ద‌ర్నీ ప‌ట్టుకున్నారు.

అనంత‌రం బాధితురాలి గ్రామానికి తీసుకొచ్చి దాడి చేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. ఆగ్రహాంతో ఊగిపోయిన గ్రామ‌స్తులు.. యువ‌కుల‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి బైక్‌ను కూడా త‌గుల‌బెట్టారు. అయితే ఓ యువ‌కుడు మృతి చెంద‌గా, మ‌రో యువ‌కుడు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దాడి జ‌రిగిన గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహ‌రించారు.

KTR: పెద్ద నేరాలకు పాల్పడేవారు.. పెద్దవారిగానే శిక్షింపబడాలి..

Exit mobile version