Site icon NTV Telugu

Hampi gangrape case: ఇజ్రాయిల్ మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితుల అరెస్ట్..

Hampi Gangrape Case

Hampi Gangrape Case

Hampi gangrape case: కర్ణాటక హంపి గ్యాంగ్‌రేప్ కేసు సంచలనంగా మారింది. హంపీకి సమీపంలో 27 ఏళ్ల ఇజ్రాయిల్ పర్యాటకురాలితో పాటు హోమ్ స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను గంగావతికి చెందిన సాయి మల్లు, చేతన్ సాయిగా గుర్తించారు.

‘‘మేము ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశాము. సాయి మల్లు, చేతన్ సాయి ఇద్దరూ గంగావతికి చెందినవారు’’ అని కొప్పల్ ఎస్పీ డాక్టర్ రామ్ అరసిద్ధి తెలిపారు. ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని, అతడి పేరును కూడా నిందితులు వెల్లడించారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

Read Also: CM Revanth Reddy: రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మార్చి 6న హంపి సమీపంలో ఇజ్రాయిల్ పర్యాటకురాలు, 29 ఏళ్ల హోమ్ స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు పర్యాటకులు సనపూర్ సరస్సు ఒడ్డున నక్షత్రాలను చూస్తుండగా ఈ సంఘటన జరిగింది. ముగ్గురు పురుష పర్యాటకులను అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంజక్, ఒడిశాకు చెందిన బిబాష్‌గా గుర్తించారు.

రాత్రి భోజనం తర్వాత హోమ్ స్టే నిర్వాహకురాలు, ఇజ్రాయిల్ పర్యాటకురాలితో పాటు ముగ్గురు పురుష పర్యాటకులు బయటకు వెళ్లారు. సనపూర్ సరస్సు సమీపంలో తుంగభద్ర కాలువ ఎడమ ఒడ్డున కూర్చుని ఉండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారివద్దకు వచ్చి పెట్రోల్ బంక్ గురించి ఆరా తీశారు, ఆ తర్వాత రూ.100 డిమాండ్ చేశారు. బాధితులు నిరాకరించడంతో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురు మగ పర్యాటకుల్ని కాలువలోకి తోశారు. ఆ తర్వాత మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు హోమ్ స్టే నిర్వాహకురాలని కొట్టగా, మూడో వ్యక్తి ముగ్గురు పురుష పర్యాటకులను కాలువలోకి నెట్టాడు. ముగ్గురిలో డేనియల్, పంకజ్ కాలువను నుంచి బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ చనిపోయారు.

Exit mobile version