కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంది.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యూడ్జ్ తొలగించి.. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యూడ్జ్‌ను ఇచ్చింది ట్విట్టర్.. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు అరుణ్ కుమార్, సురేశ్ సోనీ, సురేష్ జోషి, కృష్ణ కుమార్ ఖాతాల విషయంలో కూడా ఇదే చర్యకు పూనుకుంది.. అయితే, గత 6 నెలలుగా అన్ వెరిఫయింగ్ ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్ తొలగించినట్టు ట్విట్టర్ పేర్కొంది.. ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలకు బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ తొలగిస్తున్నట్టు వివరణ ఇచ్చింది.. ఒకవేళ సుదీర్ఘ కాలం పాటు లాగిన్ కాకపోతే ఆ ఖాతాలను పూర్తిగా తొలిగించి వేస్తారని.. ట్విట్టర్ యూజర్ ఖాతాను నిరంతరం మేనేజ్మెంట్ తనిఖీ చేస్తూ ఉంటుందని పేర్కొంది. మొత్తంగా ధృవీకరణ బ్యాడ్జ్లను కోల్పోయిన ఖాతాలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అతని నలుగురు అనుచరులు కూడా చేరిపోయారు.. ఆర్ఎస్ఎస్ నేతలు గత కొంతకాలంగా ఎలాంటి ట్వీట్ చేయలేదు.. అయితే, ఈవ్యవహారంలో ట్విట్టర్‌పై విమర్శలు పెరిగాయి.. కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణించిన తర్వాత చాలా కాలం వరకు బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యూడ్జ్ ఉన్నాయని అంటున్నారు. కాగా, మోహన్ భగవత్‌ను ట్విట్టర్‌లో 210.9 వేల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం ఆర్ఎస్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను మాత్రమకే ఫాలో అవుతున్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ ట్విట్టర్ ఖాతాకు కూడా తప్పలేదు..!
Mohan Bhagwat