Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Twist In The Murder Of A Merchant Navy Officer Black Magic Bollywood Dreams

Meerut murder: మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యలో ట్విస్ట్.. చేతబడి, బాలీవుడ్ డ్రీమ్స్..

Published Date :March 21, 2025 , 2:56 pm
By Venu Goapl Reddy
  • మీరట్ మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసులో ట్విస్ట్..
  • హత్య తర్వాత చేత బడి చేసిన భార్య లవర్..
Meerut murder: మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యలో ట్విస్ట్.. చేతబడి, బాలీవుడ్ డ్రీమ్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Meerut murder: మీటర్‌లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని భార్య ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లాలు కలిసి దారుణంగా హత్య చేశారు. విదేశాల్లో ఉండే సౌరభ్, తన 6 ఏళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తర్వాత, ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి, 15 ముక్కలుగా చేసి, డ్రమ్ముల్లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు.

అయితే, ఈ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి, సౌరభ్ తల, చేతులను వేరే గదిలోకి తీసుకెళ్లి చేతబడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాహిల్ గదిలో వింతైన పెయింటింగ్స్, డ్రాగన్ బొమ్మలు, వింత చిహ్నాలు లభించాయి. దీంతో అతను చేతబడి వంటివి చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి గదిలో ఓ పిల్లి కూడా దొరికింది. అనేక బీరు సీసాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

Read Also: Ireland: ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్‌సీ ఫైటర్ పోటీ.. ట్రంప్ హామీతో బరిలోకి!

సాహిల్ సౌరభ్ తల, చేతలను ముస్కాన్ ఇంటికి తీసుకువచ్చే ముందు, వీటిని తన గదిలోకి తీసుకెళ్లి ఏదో తాంత్రిక కర్మ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాతే ఇద్దరూ కలిసి శరీర భాగాలను డ్రమ్‌లో వేసినట్లు తెలుస్తోంది. మాదకద్రవ్యాలకు బానిసైన సాహిల్ అతీంద్రియ శక్తులను నమ్మేవాడని, ఇతరులతో చాలా అరుదుగా మాట్లాడేవాడని తేలింది. సాహిల్ ఎక్కువ సమయంలో ఇంట్లోనే గడిపేవాడని, తన ముసలి అమ్మమ్మతో ఎక్కువ సేపు ఉండేవాడని పోలీసులు తెలిపారు. సాహిల్ తల్లి చాలా క్రితమే చనిపోయింది, అతడి తండ్రి నోయిడాలో నివసిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ లండన్ నుంచి భారీ మొత్తం డబ్బుతో ఇండియాకు వచ్చినట్లు ఆయన సోదరుడు బబ్లూ చెప్పాడు. బాలీవుడ్‌లో నటి కావాలనే ఆశతో ముస్కాన్ పలుమార్లు ఇంటి నుంచి పారిపోయిందని, దీని వల్ల దంపతుల మధ్య గొడవలు కూడా జరిగేవని ఆరోపించారు. 2021లో విడాకుల కేసు కూడా దాఖలు చేశాడని, కుటుంబం ఒత్తిడితో మళ్లీ పునరాలోచించుకున్నట్లు తెలిసింది. ముస్కాన్ సౌరభ్ డబ్బుతో ఒక ప్రాపర్టీని, ఐఫోన్‌ను కొనుగోలు చేశాడని బబ్లూ ఆరోపించాడు. సౌరభ్ తన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం భారతదేశానికి తిరిగి వచ్చాడని అతను చెప్పాడు. ఈ కుట్రలో ముస్కాన్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని, ఆమె కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బబ్లు ఆరోపించారు. ముస్కాన్ ప్రేమ వ్యవహారం, ఆర్థిక సమస్యలే హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఆయుష్ విక్రమ్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Meerut Cement Murder
  • Meerut Murder
  • Saurabh Rajput Murder
  • Saurabh Rajput murder case

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions