Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?

  • తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్
  • బాధిత కుటుంబం పిటిషన్ కొట్టేసిన భోపాల్ కోర్టు
  • షాక్‌కు గురైన ట్విషా శర్మ కుటుంబం
Twishasharmadeath1

Twishasharmadeath1

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో బాధిత కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. రెండో పోస్ట్‌మార్టం చేయలన్న కుటుంబ సభ్యుల అభ్యర్థనను భోపాల్ కోర్టు తిరస్కరించింది.

ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ కుమార్తెను భర్త, అత్తమామలు చంపేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భోపాల్ ఎయిమ్స్‌లో చేసిన పోస్ట్‌మార్టం కాకుండా.. ఢిల్లీ ఎయిమ్స్‌లో నిర్వహించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేయగా.. బుధవారం కొట్టేసింది. దీంతో ఈ కేసు కీలక ములుపు తిరిగింది.

పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో తమ న్యాయపోరాటాన్ని కొనసాగించాలా లేక అంత్యక్రియలు నిర్వహించాలా అనే విషయంలో బాధిత కుటుంబం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో పడింది. ట్విషా శర్మ కుటుంబం వేధింపులకు సంబంధించి చేసిన ఆరోపణలు, ఆమె మరణం చుట్టూ నెలకొన్న అనుమానాస్పద పరిస్థితుల కారణంగా ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. పోలీసులు ఇప్పటికే వరకట్నం మరణం, క్రూరత్వానికి సంబంధించిన అభియోగాల కింద ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తుండగా.. ఫోరెన్సిక్ పరిశోధనలు, డిజిటల్ ఆధారాలు పరిశీలనలో ఉన్నాయి.

ట్విషా శర్మ మే 12 రాత్రి సుమారు 10:26 గంటలకు ఇంటి టెర్రస్‌పై జిమ్నాస్టిక్ రింగ్ తాడుతో ట్విషా ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా మే 13 అర్ధరాత్రి తర్వాత మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, మానసిక హింస ఎదుర్కొంటోందని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఇక భోపాల్ ఎయిమ్స్ ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చింది. అలాగే బలమైన గాయాలు ఉన్నట్లుగా పేర్కొంది. అయితే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బాధిత కుటుంబం ఆరోపించింది.

నోయిడాలో నివాసం ఉండే ట్విషా శర్మకు… 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్‌కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్‌సింగ్‌తో ఢిల్లీలో గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్‌లోని అత్తగారింట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది.

సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితో వాట్సాప్‌లో చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమర్థ్‌సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ వాట్సాప్ చాట్ వెలుగులోకి రావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసనకు దిగింది. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు.