TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!

  • తమిళనాడులో వీడిన రాజకీయ అనిశ్చితి
  • విజయ్‌కు చిన్నా పార్టీల మద్దతు
  • మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్న విజయ్ బలం
  • అయితే ఆసక్తిగా మారిన చిన్న పార్టీల షరతలు
Vijaytvk

Vijaytvk

తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. వామపక్షాలు, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ చేరింది. 234 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118కు చేరింది. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

అయితే చిన్న పార్టీలు మద్దతు ప్రకటిస్తూనే ఆ పార్టీలు పెట్టిన షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే అన్నట్టుగా ఉంది. టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ షరతు పెట్టింది. మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్‌ కండీషన్‌ విధించింది. ఇక సీపీఎం విషయానికొస్తే కేవలం సపోర్ట్‌ మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక సీపీఐ బేషరతు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. అంటే కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు ప్రకటించాయి. అయితే కేబినెట్‌లో మాత్రం చేరడం లేదని వామపక్షాలు తెల్చి చెప్పాయి. ఇక వీసీకే విషయానికొస్తే… ఒక మంత్రి పదవితో పాటు తిరుచ్చి ఈస్ట్‌ తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. తిరుచ్చి ఈస్ట్‌ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావళన్‌ భావిస్తున్నారు. విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే విజయ్ పెరంబూర్‌ను ఉంచుకుని.. తిరుచ్చి ఈస్ట్ విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్‌ను వీసీకే కోరుతోంది.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. టీవీకే 108, డీఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, ముస్లిం లీగ్ 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అయితే చిన్న పార్టీలు ఇప్పటి దాకా డీఎంకే కూటమిలో ఉన్నాయి. అయితే విజయ్ మద్దతు కోరగానే కాంగ్రెస్.. డీఎంకేతో చర్చించకుండానే మద్దతు ప్రకటించింది. అయితే గవర్నర్ అర్లేకర్.. మ్యాజిక్ ఫిగర్ చూపించపోవడంతో విజయ్‌కు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడడంతో వామపక్షాలు, వీసీకే విజయ్‌కు మద్దతు తెల్పాయి. దీంతో ఐదు రోజులుగా ఏర్పడిన ఉత్కంఠ వీడింది. ఇక విజయ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.