TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

  • ఈనెల 7న సీఎంగా ప్రమాణం చేయనున్న విజయ్
  • సోషల్ మీడియాలో పాత వీడియో వైరల్
  • అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే
Vijaytvk

Vijaytvk

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని శక్తివంతమైన పార్టీగా నిలిచింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఉన్నారు. ఇక మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధపడుతున్నారు. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ స్టేడియం రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో ఏడేళ్ల క్రితం వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘సర్కార్’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో యాంకర్‌గా వ్యవహరించిన ఓ నటుడు.. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తారా? అని విజయ్‌ను అడిగాడు. దానికి విజయ్ స్పందిస్తూ.. ‘‘తాను సీఎంగా నటించను.. కానీ ముఖ్యమంత్రిని అవుతాను.’’ అని బదులిచ్చారు. అంతే ఫంక్షన్‌కు హాజరైన తల్లిదండ్రులతో పాటు కళాకారులంతా చప్పట్లతో ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయ్ అన్నట్టుగానే ఒరిజినల్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈనెల 7న సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక విజయ్ కథానాయకుడిగా నటించిన ‘సర్కార్’ సినిమా 2018లో విడుదలైంది.

తాజా ఎన్నికల్లో టీవీకే 234 స్థానాల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే పూర్తి మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతుండగా.. కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్‌తో సహా చిన్న పార్టీల దగ్గర 14 సీట్లు ఉన్నాయి. వారి మద్దతుతో విజయ్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.