Site icon NTV Telugu

TVK Chief Vijay: కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్..

Vj

Vj

TVK Chief Vijay: తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌ నిన్న ( సెప్టెంబర్ 27న ) కరూర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ షో సందర్భంగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 39 మందికి పైగా మృతి చెందగా.. 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Read Also: Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు

ఇక, కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.

Exit mobile version