Karnataka Road Accident: కర్నాటక లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

Karnataka Road Accident

Karnataka Road Accident

Karnataka Road Accident: కర్నాటక లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుముకూరు జిల్లాలోని బాలినహళ్లిలో ఓ లారీ జీపును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మృతుల్లో ముగ్గురు చిన్నారు వున్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతుచెందిన వారిని రాయచూర్‌ జిల్లా వాసులుగా గుర్తించారు.

48వ నెంబర్‌ జాతీయ రహదారిపై రాయచూర్‌ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్‌టేక్‌ క్రమంలో లారీ ఢీకొట్టినట్లు సమాచారం. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈప్రమాదానికి గురైన వారంతా రోజువారీ కూలీలు అని వెల్లడించారు పోలీసులు.
Earthquake: జమ్మూ కాశ్మీర్ లో వరసగా తొమ్మిది భూకంపాలు.. పొంచి ఉన్న ప్రమాదం