H-1B visa: ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..
- ఆదివారం అమెరికా చేరుకోకపోతే అంతే సంగతి..
- ట్రంప్ H1B వీసా చర్యలతో భయం భయం..
- H1B వీసాదారుల్లో 70 శాతం మంది భారతీయులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా వార్షిక రుసుమును భారీగా పెంచాడు. ఈ చర్యల ముఖ్యంగా భారతీయుల టెక్కీలు, ఇతర రంగాల్లో అమెరికాలో పనిచేస్తున్న వారికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. H-1B visa వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. ప్రస్తుత వీసా హోల్డర్లతో సహా H-1B ఉద్యోగులు, వారి యజమాని ఉద్యోగికి USD 100,000 వార్షిక రుసుము (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించకపోతే ఆదివారం నుంచి అమెరికా లోకి ప్రవేశం నిరాకరించబడుతుందని ట్రంప్ కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆదివారం (సెప్టెంబర్ 21) ఉదయం 12.01EDT( భారత కాలమానం ప్రకారం, ఉదయం 9.30) తర్వాత యూఎస్ లోకి ప్రవేశించే ఏ H-1B హోల్డర్‌కైనా ప్రయాణ నిషేధం, రుసుము నిబంధన వర్తిస్తుంది. కొత్తగా H-1B వీసాలు, వీసాల పొడగింపు ప్రక్రియను కొనసాగించడానికి 1,00,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది, ఈ మొత్తాన్ని చెల్లించాలని ట్రంప్ ఉత్తర్వులు చెబుతున్నాయి.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ నిషేధంపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. H-1B వీసా కలిగిన వారు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడితే, వారి వల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండకపోతే, అమెరికా ప్రజల సంక్షేమానికి హాని కలగకుంటే వీరు నిషేధం నుంచి మినహాయించబడుతారు. వీటిని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే నిర్ణయిస్తారు. అమెరికాకు ఉపయోగపడే విదేశీయులకు మినహాయింపులు ఇవ్వవచ్చు.
Read Also: Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్
ఈ నిబంధనలు 12 నెలల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీల సిఫారసుపై పొడగించవచ్చు. ట్రంప్ ఉత్తర్వులతో అమెరికాలో మెటా, మైకోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల్ని వెంటనే అమెరికాకు తిరిగి వచ్చేయాలని కోరారు. ఈ నిబంధనలు పూర్తిగా అర్థం అయ్యే వరకు 14 రోజుల పాటు అమెరికాలో ఉండే H-1B వర్కర్ల దేశం విడిచివెళ్లవద్దని సూచించారు. నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రతీ ప్రతి H-1B వీసాకు సంవత్సరానికి USD 100,000 చెల్లించాల్సి ఉంటుంది, ఇది మునుపటి USD 1,500 పరిపాలనా రుసుముతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, అక్టోబర్ 2022 మరియు సెప్టెంబర్ 2023 మధ్య జారీ చేయబడిన దాదాపు 4 లక్షల H-1B వీసాలలో భారతీయులు 72 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల చాలా మంది భారతీయులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారం లేదా సెలవు కోసం అమెరికా నుంచి సొంతదేశానికి వెళ్లిన H-1B వీసాదారులు సెప్టెంబర్ 21 అర్ధరాత్రికి ముందే అమెరికా చేరుకోకపోతే అవకాశం ఉంది. భారత్‌లో ఉండే, H-1B వీసాదారులు ఇప్పుడు ప్రారంభమైనా, సకాలంలో అమెరికా చేరుకునే అవకాశం కనిపించడం లేదు.
తాజావార్తలు
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!