Site icon NTV Telugu

H-1B visa: ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..

H 1b Visa

H 1b Visa

H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా వార్షిక రుసుమును భారీగా పెంచాడు. ఈ చర్యల ముఖ్యంగా భారతీయుల టెక్కీలు, ఇతర రంగాల్లో అమెరికాలో పనిచేస్తున్న వారికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. H-1B visa వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. ప్రస్తుత వీసా హోల్డర్లతో సహా H-1B ఉద్యోగులు, వారి యజమాని ఉద్యోగికి USD 100,000 వార్షిక రుసుము (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించకపోతే ఆదివారం నుంచి అమెరికా లోకి ప్రవేశం నిరాకరించబడుతుందని ట్రంప్ కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆదివారం (సెప్టెంబర్ 21) ఉదయం 12.01EDT( భారత కాలమానం ప్రకారం, ఉదయం 9.30) తర్వాత యూఎస్ లోకి ప్రవేశించే ఏ H-1B హోల్డర్‌కైనా ప్రయాణ నిషేధం, రుసుము నిబంధన వర్తిస్తుంది. కొత్తగా H-1B వీసాలు, వీసాల పొడగింపు ప్రక్రియను కొనసాగించడానికి 1,00,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది, ఈ మొత్తాన్ని చెల్లించాలని ట్రంప్ ఉత్తర్వులు చెబుతున్నాయి.

డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ నిషేధంపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. H-1B వీసా కలిగిన వారు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడితే, వారి వల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండకపోతే, అమెరికా ప్రజల సంక్షేమానికి హాని కలగకుంటే వీరు నిషేధం నుంచి మినహాయించబడుతారు. వీటిని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే నిర్ణయిస్తారు. అమెరికాకు ఉపయోగపడే విదేశీయులకు మినహాయింపులు ఇవ్వవచ్చు.

Read Also: Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్

ఈ నిబంధనలు 12 నెలల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీల సిఫారసుపై పొడగించవచ్చు. ట్రంప్ ఉత్తర్వులతో అమెరికాలో మెటా, మైకోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల్ని వెంటనే అమెరికాకు తిరిగి వచ్చేయాలని కోరారు. ఈ నిబంధనలు పూర్తిగా అర్థం అయ్యే వరకు 14 రోజుల పాటు అమెరికాలో ఉండే H-1B వర్కర్ల దేశం విడిచివెళ్లవద్దని సూచించారు. నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రతీ ప్రతి H-1B వీసాకు సంవత్సరానికి USD 100,000 చెల్లించాల్సి ఉంటుంది, ఇది మునుపటి USD 1,500 పరిపాలనా రుసుముతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, అక్టోబర్ 2022 మరియు సెప్టెంబర్ 2023 మధ్య జారీ చేయబడిన దాదాపు 4 లక్షల H-1B వీసాలలో భారతీయులు 72 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల చాలా మంది భారతీయులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారం లేదా సెలవు కోసం అమెరికా నుంచి సొంతదేశానికి వెళ్లిన H-1B వీసాదారులు సెప్టెంబర్ 21 అర్ధరాత్రికి ముందే అమెరికా చేరుకోకపోతే అవకాశం ఉంది. భారత్‌లో ఉండే, H-1B వీసాదారులు ఇప్పుడు ప్రారంభమైనా, సకాలంలో అమెరికా చేరుకునే అవకాశం కనిపించడం లేదు.

Exit mobile version