INDIA vs Trump: మాస్కో నుంచి ముడి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై తీవ్రంగా మడిపడితున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల భారీగా టారిఫ్‌లను విధించిన సంగతి తెలిసిందే. రష్యాతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు (Trump Tariffs) విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే, దీనిపై తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ట్రంప్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ సుంకాలపై శాతాల గురించి చెప్పలేదని వెల్లడించారు. కానీ, దానిపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. చాలా తక్కువ సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.. రేపు (యూఎస్ కాలమానం ప్రకారం బుధవారం) రష్యా (Russia)తో భేటీ జరగనుంది. అందులో ఏం జరుగతుందో చూడాలని ట్రంప్ తెలిపాడు.
Read Also: Gold Rate Today: ఆగని పసిడి పరుగు.. కొనాలంటే కష్టమే! నేటి గోల్డ్ రేట్స్ ఇలా
ఇక, ఈ సందర్భంగా రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్ చేసిన వాదనలపై విలేకరులు ట్రంప్‌ను క్వశ్చన్ చేశారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ఈ విషయం గురించి నాకు తెలియదు.. తెలుసుకుని.. త్వరలోనే మీకు సమాధానమిస్తానని చెప్పారు. మరోవైపు, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తేనే.. భారత్‌పై ట్రంప్ అక్కసు వెల్లగక్కుతున్నాడు. ఇప్పటికే న్యూఢిల్లీపై 25శాతం టారీఫ్స్ విధించిన ఆయన.. మరికొన్ని గంటల్లో దీన్ని భారీగా పెంచుతామని హెచ్చరించాడని పేర్కొన్నారు.
