NTV Telugu Site icon

Tripura: రథయాత్రలో విషాదం.. ఎలక్ట్రిక్ వైర్ మీద పడటంతో ఆరుగురు మృతి

Tripura

Tripura

Tripura:త్రిపుర రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఇనుముతో చేసిన రథంపై ఎలక్ట్రిక్ వైర్ మీదపడటంతో ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉనాకోటిలోని చౌముహని ప్రాంతంలో ఉరేగింపు జరుగుతుండగా రథంపై ఎలక్ట్రిక్ వైర్ మీద పడింది. ఆ సమయంలో రథంపై కనీసం 20 మంది ఉన్నారు. కరెంట్ షాక్ తో ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

Read Also: PM Modi: ఫ్రాన్స్ జాతీయదినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోడీ.. పరేడ్‌లో పాల్గొననున్న రాఫెల్ జెట్స్

ఈ ప్రమాదంలో రథానికి కూడా మంటలు అంటుకున్నాయి. చాలా మంది వరకు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను కుమార్‌ఘాట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉనకోటి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వార్షిక రథయాత్ర పండుగ తర్వాత జగన్నాథుడ తిరుగు ప్రయాణానికి సంబంధించి ‘ఉల్టో రథ్’ ఊరేగింపులో ఈ సంఘటన జరిగింది. ఇనుముతో చేసిన రథాన్ని భారీగా అలంకరించారు. ఓవర్ హెడ్ విద్యుత్ తీగకు తాకడంతో విద్యుత్ ప్రవాహానికి గురై ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి రథానికి విద్యుత్ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మరణాలకు సంతాపం తెలిపారు.