Mukul Roy: బాత్‌రూంలో పడిపోయిన తృణమూల్ నేత.. అపస్మారక స్థితిలో ఆస్పత్రికి..

  • బాత్రూంలో జారిపడిన తృణమూల్ నేత ముకుల్ రాయ్..
  • తలకు తీవ్రగాయంతో అపస్మారక స్థితిలోకి..
  • క్రిటికల్‌గా పరిస్థితి..
Mukul Roy

Mukul Roy

Mukul Roy: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్ గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం బాత్రూంలో జారిపడి ముకుల్ రాయ్ తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం అతని పరిస్థితిని క్రిటికల్‌గా ఉందని తెలుస్తోంది. ముకుల్ రాయ్‌ని పర్యవేక్షించడానికి వైద్యుల బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Read Also: West Bengal : న్యాయం జరగలేదు… బెంగాల్ గవర్నర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహిళ

నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ రాయ్ స్పృహ కోల్పోయేలోపు వాంతులు చేసుకున్నాడు. అవసరమైన వైద్య పరీక్షలు జరిగాయని, తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోవడానికి నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు వైద్యలు తెలిపారు. డెమెన్షియాతో బాధపడుతున్న ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కష్ణానగర్ నార్త్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ టీఎంసీలో చేరారు.