TMC: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ లూయిజిన్హో ఫలేరో తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టీఎంసీ తన జాతీయ పార్టీ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించింది. గోవాలోని నవేలిమ్ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన 71 ఏళ్ల ఫలీరో గతేడాది గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీలో చేరారు. ఆయనకు బెంగాల్ నుంచి టీఎంసీ తరుపున రాజ్యసభ సభ్యత్వం లభించింది.
Read Also: IPL Tickets Issue: తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ టికెట్ల పంచాయతీ..
ఫాలీరోను రాజ్యసభకు రాజీనామా చేయాల్సిందిగా టీఎంసీ నాయకత్వం గట్టిగా కోరినట్లు సమాచారం. 2022 గోవా గోవా ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్‌పై ఫటోర్డా నుంచి పోటీ చేసేందుకు నిరాకరించినందుకు టీఎంసీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో టీఎంసీ గోవాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. 2026 వరకు పదవీ కాలం ముగిసే సమయం ఉన్నా కూడా రాజ్యసభ ఎంపీ అర్పితా ఘోష్ ను రాజీనామా చేయమని టీఎంసీ కోరింది. ఆ తరువాత ఫలెరోను రాజ్యసభకు పంపింది. ఫలిరో 2022 గోవా ఎన్నికలలో పోటీ చేయకూడదనే నిర్ణయంతో అతను పార్టీ నుండి వైదొలిగినట్లు వచ్చాయి. అయితే అప్పటి నుంచి గోవా పార్టీ వ్యవహారాలకు తృణమూల్ అతడిని పక్కన పెట్టింది.