Site icon NTV Telugu

Chennai: ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చిన రైలు.. తప్పిన ప్రాణనష్టం

Train Accident Min

Train Accident Min

ఆదివారం నాడు చెన్నై నగరంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైలు.. పట్టాలు తప్పి ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్‌ఫారం ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని బీచ్ స్టేషన్‌లో సబర్బన్ రైలు పట్టాలు తప్పింది. షెడ్‌ నుంచి స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. అయితే ఈ రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వేస్టేషన్‌ వైపు సబర్బన్ రైలు వెళ్తున్న సమయంలో బీచ్ స్టేషన్‌కు వచ్చేటప్పటికి రైలు నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫారం వైపు దూసుకొచ్చింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో లోకోపైలట్ గాయపడ్డట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదం జరగడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version