NTV Telugu Site icon

PM Modi: రెండో దశ ఎన్నికల ముగిసిన వేళ మోడీ కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశ ఎన్నికలు ఎన్డీయేకు కలిసి వచ్చిందని శుక్రవారం అన్నారు. అధికార పార్టీకి అసమానమైన మద్దతు లభించిందని చెప్పారు. పోలింగ్ ముగియగానే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘రెండో దశ చాలా బాగుంది. ఈ రోజు ఓటు వేసిన భారతదేశం అంతటా ప్రజలకు కృతజ్ఞతలు. NDAకి అసమానమైన మద్దతు ప్రతిపక్షాలను మరింత నిరాశకు గురి చేస్తుంది. ఓటర్లు ఎన్‌డిఎ సుపరిపాలనను కోరుకుంటున్నారు. యువత మరియు మహిళా ఓటర్లు బలమైన ఎన్‌డిఎ మద్దతును బలపరుస్తున్నారు’’ అని అన్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఓటింగ్ తర్వాత కూడా ప్రధాని ఇదే రకమైన స్పందనను వ్యక్తపరిచారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఎన్డీయేకు ఓటు వేస్తున్నారని చెప్పారు.

Read Also: Maldives: మాల్దీవులలో చైనా రీసెర్చ్ షిప్.. ముయిజ్జూ భారీ విజయం తర్వాత కీలక పరిణామం..

దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. తొలిదశలో దేశవ్యాప్తంగా 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగగా.. ఈ రోజు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి.

Show comments