Centre Issues Advisory To States On Tomato Flu: హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధి సాధారణంగా టొమాటో ఫ్లూగా పిలువబడే ఈ వ్యాధి దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దేశంలో తొమ్మిదేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిలల్లో 100కు పైగా టొమాటో ఫ్లూ కేసులు నమోదు అయ్యాయని లైవ్ మింట్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మే6న కేరళలోని కొల్లాం జిల్లాలో తొలి కేసు నమోదు అయింది. ఆ తరువాత అంచల్, ఆర్యంకావు, నెడువత్తూర్ ప్రాంతాలకు వ్యాపించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు టొమాటో ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఒడిశాలో 26 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకింది.
తాజాగా టొమాటో ఫ్లూ వ్యాధిపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. టొమాటో ఫ్లూ ప్రధానంగా 10 ఏళ్ల లోపు ఉండే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. పెద్దల్లో కూడా ఈ వ్యాధి సంభవించవచ్చని వెల్లడించింది. టొమాటో ఫ్లూ వ్యాధి లక్షణాలు, దుష్ప్రభావాలపై పిల్లలకు తప్పకుండా అవగాహన కల్పించాలని సూచించింది. టొమాటో ఫ్లూ జ్వరం, అలసట, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల లాగే లక్షణాలు కనిపిస్తాయని.. అయితే ఇది కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ గున్యాకు సంబంధించింది కానది సూచించింది.
Read Also: Alia Bhatt: ఇష్టం లేకపోతే నన్ను చూడకండి.. స్టార్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
పిల్లలకు, పెద్దలకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని సూచించింది. వ్యాధి సోకిన వ్యక్తితో ఇతరులు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. జ్వరం, దద్దుర్లు ఉన్న ఇతర పిల్లలను కౌగిలించుకోవద్దని, తాకవద్దని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలని తెలిపింది. పిల్లలు వేళ్లు చప్పరించే అలవాటు, వెళ్లను నోటిలో పెట్టుకునే అలవాటును ఆపాలని తల్లిదండ్రులకు సూచించింది. చర్మాన్ని శుభ్రపరచాడానికి, పిల్లల స్నానం చేయడానికి ఎల్లప్పుడూ వెచ్చని నీటిని వాడాలని.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి పోషకాహారాన్ని తీసుకోవాలని.. సూచించింది.