పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,110 వద్ద కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
