ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 9,283 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 437 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,35,763 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,11,481 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇప్పటి వరకు కరోనాతో 4,66,584 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 10,949 మంది కరోనా నుంచి కోలుకోగా 76,58,203 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,18,44,23,573 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
భారత్ కరోనా : మళ్ళీ 10 వేలకు చేరువలో కేసులు
