NTV Telugu Site icon

Tamilisai: త్రిభాషా విధానానికి మద్దతుగా ఆందోళన.. తమిళిసై అరెస్ట్

Tamilisai

Tamilisai

తమిళనాడులో త్రిభాషా ఉద్యమం ఉధృతం అవుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ మహిళా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ కోయంబేడులో ఆందోళన చేపట్టారు. సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. ఇక తమిళిసై చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమాన్ని తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. తమిళిసైను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. ఉద్యమంపై ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Cyber Crime: హైదరాబాద్లో వెలుగు చూసిన కాల్ సెంటర్ స్కాం..

రాష్ట్రంలో త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ చేపట్టింది. ఇక అధికార పార్టీ డీఎంకే బుధవారం చేపట్టిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా బీజేపీ నిర్ణయం తీసుకుంది. మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది.

ఇది కూడా చదవండి: Posani Krishna Murali: ఏపీ హైకోర్టులో పోసానికి స్వల్ప ఊరట