Site icon NTV Telugu

గోల్డ్ గెలిస్టే మూడు కోట్లు…

త్వ‌ర‌లోనే జ‌పాన్‌లో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి.  గ‌తేడాది నిర్వ‌హించాల్సిన ఒలంపిక్స్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో జ‌రుగుతున్న క్రీడ‌లు కావ‌డంతో, నిబంధ‌న‌లు పాటిస్తూ, క్రీడాకారులు క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హిస్తూ క్రీడ‌ల‌ను నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  

Read: ‘నరసింహపురం’లోకి పెద్దలకు మాత్రమే ఎంట్రీ!

ఈ క్రీడ‌ల్లో త‌మిళనాడుకు చెందిన క్రీడాకారులు కూడా పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించింది.  టోక్యో క్రీడ‌ల్లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన వారికి రూ. 3కోట్లు, సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన వారికి రూ.2 కోట్లు, ర‌జ‌తం గెలిచిన వారికి కోటి రూపాయ‌ల‌ను బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు.  

Exit mobile version