Site icon NTV Telugu

Abhishek benerjee: ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు.. అమిత్ షా

Abhishek Benerjee

Abhishek Benerjee

Abhishek benerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేసిన వేళ అమిత్‌ షాను ‘ఇండియాలోనే అతిపెద్ద పప్పు’ అని కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అభిషేక్ ఈ కామెంట్ చేసిన తర్వాత.. టీఎంసీ నాయకులు అమిత్ షా ముఖంతో పాటు ‘భారతదేశంలో అతిపెద్ద పప్పు’ అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్టులను తన పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిపై తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో అభిషేక్ బెనర్జీ వివరించారు.

అభిషేక్ బెనర్జీ పశువుల స్మగ్లింగ్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొంటున్నారు. బెనర్జీని ఈడీ గత వారం గంటల తరబడి ప్రశ్నించింది. ఆ తర్వాత అమిత్ షాను ఆయన భారతదేశపు అతిపెద్ద పప్పు అంటూ వ్యాఖ్యానించారు. గురువారం బెంగాల్‌లోని టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన దీనిపై స్పందించారు. ‘కారణాలున్నాయి కాబట్టే అమిత్ షాను అతి పెద్ద పప్పు అని పిలిచాను. ఒకసారి ఢిల్లీ నేరాల రేటు చూడండి. కోల్‌కతాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని మీ స్వంత ఏజెన్సీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు మాత్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నారు. అయినా అక్కడ క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అమిత్‌షా అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారు. కానీ మీ అబ్బాయి(బీసీసీఐ కార్యదర్శి జై షా)కి మాత్రం జాతీయ జెండా పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది. ముందుగా అతనికి నేర్పించండి‘ అని షా ను ఉద్దేశించి బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత జై షా జాతీయ జెండాను ఊపేందుకు నిరాకరించారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రి కార్టూన్‌తో టీ-షర్ట్‌ను రూపొందించారు. “ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు” అనే క్యాప్షన్‌తో పాటు అమిత్‌ షా ముఖం కార్టూన్‌ను కలిగి ఉన్న టీ-షర్టు తెలుపు, నలుపు, పసుపు రంగులలో వస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని “పప్పు” అనే పేరు పెట్టింది, దీనిని ఇప్పుడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అమిత్‌ షాను ఎగతాళి చేయడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తోంది. అక్టోబరు మొదటి వారంలో దుర్గాపూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్ అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలు అమ్మవారిని సందర్శిస్తున్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఈ టీ-షర్టు ప్రచారాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.

Munugodu Bypoll Candidate: కాంగ్రెస్‌ మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

“మాకింగ్ అనేది కమ్యూనికేట్ చేయడంలో అత్యంత శక్తివంతమైన రూపం. ఇది మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్య నుంచి ప్రారంభమైంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అది టీ-షర్టులపైకి వచ్చింది,” అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. .

Exit mobile version