NTV Telugu Site icon

Breaking News: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్.. తిరుచ్చి ఏయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్..

Tiruchirappalli Airport

Tiruchirappalli Airport

Breaking News: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్య ఎదురైంది. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి పైలెట్ అనుమతి కోరాడు. విమానం తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద సంఖ్య పారామెడిక్ సిబ్బంది, 20 ఫైర్ ఇంజన్లు, 20 అంబులెన్సులు రెడీగా ఉన్నాయి. గంటన్నర పైగా విమానం తిరుచ్చి గగనతలంలోనే చక్కర్లు కొడుతోంది. విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుచ్చికి వచ్చే విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు.

Show comments