Tina Ambani: రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఆమె ఈడీ ముందు హాజరుకావాల్సి వచ్చింది. ఇదే కేసులో సోమవారం అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఈడీ ఆఫీసులో టీనా అంబానీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read also: Goat Eye: బలి కోసం తెచ్చిన మేక కన్ను.. మనిషిని చంపింది.. ఎలానో తెలిస్తే బిత్తరపోతారు
విదేశీ మారకద్రవ్యం చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. అనిల్ అంబానీపై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు చెప్తున్నారు. అనిల్ అంబానీతోపాటు ఆయన భార్య టినా అంబానీ ఈ వారంలో మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఈడీ సమన్లు జారీ చేసిన అధికారులు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) సెక్షన్ల కింద అనిల్ అంబానీ సోమవారం ఈ కేసులో తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఈ వారం చివరిలో ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరుకావాల్సి ఉంది. జెర్సీ, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ మరియు సైప్రస్‌లోని కొన్ని ఆఫ్‌షోర్ కంపెనీలతో అనిల్ అంబానీ లింక్‌లున్నట్టు ఆరోపణల నేపథ్యంలో ED విచారణ కొనసాగిస్తోంది. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ మరియు ఇతరులపై మనీలాండరింగ్ కేసులో 2020లో ఏజెన్సీ అతన్ని ప్రశ్నించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ.420 కోట్ల పన్నులు ఎగవేసినందుకు నల్లధన నిరోధక చట్టం కింద గత ఏడాది ఆగస్టులో ఆదాయపు పన్ను శాఖ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు మార్చిలో ఈ షోకాజ్ నోటీసు మరియు పెనాల్టీ డిమాండ్‌పై మధ్యంతర స్టే విధించిన సంగతి తెలిసిందే. అనిల్ అంబానీపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరింది.
