Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!

  • ముంబై జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..
  • కాల్పులకు పాల్పడింది తామే అని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన..
  • ఘటన నుంచి తృటిలో బయటపడిన టైగర్, డ్రైవర్ చేతికి గాయాలు..
  • సల్మాన్ ఖాన్‌పై కోపమే కాల్పులకు కారణమా.?
Tiger Shroff Firing

Tiger Shroff Firing

Tiger Shroff Firing: బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ఆదివారం ముంబైలో కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ గ్రౌండ్ ననుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ ఘటన తర్వాత ఒక ఆడియో మెసేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడిన వారు తమను తాము ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ మనుషులమని చెప్పుకున్నారు. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారిని చంపేస్తామని హెచ్చరించారు. అయితే, ఈ ఆడియో నిజమైందా కాదా? అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.

సల్మాన్‌లో పనిచేయడమే కారణమా.?

ఆడియోలో అనిల్ పండిట్‌గా తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. గ్యాంగ్ ఆదేశాలు పట్టించుకోకుండా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసినందుకే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పాడు. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారిని చంపేస్తామని, ఇదే మొదటి, చివరి హెచ్చరిక అని బెదిరించారు. ‘‘సల్మాన్ ఖాన్‌కు సహాయం చేసే వారెవరైనా, మీ అకౌంట్లు సరిగా ఉంచుకోండి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్‌కు పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆడియోలో ఆరోపించారు. 1998లో జరిగిన కృష్ణజింకల వేట తర్వాత నుంచి బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తోంది. పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను బెదిరించింది.