Site icon NTV Telugu

Congress MLA: 15 అడుగుల స్టేజ్‌పై నుంచి పడిపోయిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే..

Kerela Mla

Kerela Mla

Congress MLA: కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమా థామస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై సదరు ఎమ్మెల్యేతో పాటు నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే టైంలో ఆమె.. వేదికపై నుంచి జారి కింద పడిపోయారు. ఈ సమయంలో నేల మీద కాంక్రీట్ స్లాబ్‌ ఉండటంతో అది తగిలడటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్రంగా రక్తం రావడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.

Read Also:

అయితే, వేదిక ఎత్తు దాదాపు 15 అడుగులు ఉండటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలు అయ్యాయి. అలాగే, గర్భాశయం, వెన్నెముకలో కూడా గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైనట్టు డాక్టర్లు సూచించారు. తన వద్దకు వచ్చిన వారిని గుర్తించి, ఆమె మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదిక ఏర్పాటు విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం, తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Exit mobile version