Site icon NTV Telugu

Train Derailment in Odisha: పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు

Train

Train

ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికి ఒకటి ఢీకొట్టడం, ట్రైన్లలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెక్నికల్ సమస్యలతో, మానవ తప్పిదాల కారణంగా కూడా రైళ్లు ప్రమాదబారినపడుతున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.ఈ ప్రమాదంలో మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

Also Read:Kash Patel: FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం.. ట్రంప్ ప్రశంసలు

రాయ్‌పూర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మూడు కోచ్‌లు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తూర్పు కోస్తా రైల్వే అధికారులు, సంబల్పూర్ DRM తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. దెబ్బతిన్న కోచ్ లను ట్రాక్ నుంచి తొలగించి పునరుద్దరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Exit mobile version