NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోదీని చంపుతామని బెదిరింపు.. మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్

ప్రధాని మోదీ హత్యకు కొందరు దుండగులు కుట్ర పన్నారు. ఈ మేరకు ముంబైలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. మోదీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్స్ రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే కేంద్ర భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ-మెయిల్‌ను ఎవరు పంపారో కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.