NTV Telugu Site icon

Gaurav Gogoi: గత పదేళ్లలో అత్యంత బలహీన బడ్జెట్ అంటే ఇదే..

Gogoai

Gogoai

Gaurav Gogoi: లోక్ సభలో ఈరోజు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గౌరవ్‌ గొగోయ్‌ రియాక్ట్ అయ్యారు. బడ్జెట్‌లో ఏ మాత్రం పస లేదని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్‌ అంటూ అతడు విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు మేలు చేసే అంశం ఏముందని గొగోయ్ ప్రశ్నించారు.

Read Also: Budget 2025: గుడ్న్యూస్ త్వరలో ధరలు తగ్గేవి ఇవే..!

అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాటపై తాము పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ చెప్పుకొచ్చారు. కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు అందరం సభ నుంచి వాకౌట్‌ చేశామన్నారు. అయినప్పటికీ చర్చకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా అనే విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. లోక్ సభలో చర్చ ద్వారానే ఏ విషయంలోనైనా నిజా నిజాలు బయటికి వస్తాయని గౌరవ్ గొగోయ్‌ వెల్లడించారు.