NTV Telugu Site icon

Uttar Pradesh: ఇదేం “రీల్స్” పిచ్చి.. ప్రయాణిస్తున్న రైలు కింద పడుకుని వీడియో..

Insta Reel

Insta Reel

Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వ్యూస్, ఫాలోవర్లను రాబట్టుకోవాలని కంటెంట్ క్రియేటర్లు చూస్తు్న్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ కు చెందిన ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకుని, ప్రయాణిస్తున్న ట్రైన్‌ని షూట్ చేశాడు. వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read Also: JPMorgan CEO: అమెరికాలో ఆర్థిక మాంద్యం, భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం

రీల్ క్రియేటర్ తన మొబైల్‌తో ట్రాక్‌పై పడుకుని, రైలుకు ప్రయాణిస్తున్న సమయంలో క్యాప్చర్ చేశాడు. మొత్తం రైలు అతడి మీదుగా వెళ్లేంత వరకు వీడియో షూట్ చేస్తూనే ఉన్నాడు. రీల్ చేసిన వ్యక్తిని ఉన్నావ్‌లోని హసన్‌గంజ్ నివాసి 22 ఏళ్ల రంజిత్ చౌరాసియాగా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు దృష్టిలో పడింది. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ఇది ఎడిటెడ్ వీడియో అని చెబుతున్నారు. దీనిని గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్‌ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు జీఆర్పీ అధికారి అరవింద్ పాండే చెప్పారు.