Thieves Steal 2 KM Railway Track In Bihar Samastipur: బిహార్‌లో మరో వింత ఘటన వెలుగు చూసింది. సమస్తిపూర్ జిల్లాలో రైల్వే లైన్ చోరీకి గురయ్యింది. దాదాపు 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను కొందరు దుండగులు దొంగలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిందితులపై శాఖాపరమైన విచారణను ఏర్పాటు చేశామని, ఇందులో దోషులుగా తేలితే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. జనవరి 24వ తేదీన వెలుగు చూసిన ఈ ఘటన కేసుని స్క్రాప్ స్కామ్‌గా పేర్కొంటున్నారు.
Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్
ఈ రైల్వే లైన్‌ను లోహత్ చక్కెర కార్మాగారం కోసం వేశారు. అయితే.. ఆ మిల్లు మూతపడి చాలాకాలం అవుతోంది. అది మూతపడినప్పటి నుంచి ఆ రైలు మార్గం కూడా మూసివేయబడింది. మిల్లు మూతపడిన తర్వాత అక్కడున్న సరుకుతో పాటు రైల్వే లైన్‌ను కూడా టెండర్ తీసుకొని, స్క్రాప్‌గా వేలం వేయాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే ఆ రైల్వే ట్రాక్ దోపిడీ చేయబడింది. ఈ ఆరోపణలపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. చోరీ నిజమని తేలింది. దీనిపై దర్భంగా ఆర్పీఎఫ్‌లో పోలీసు కేసు నమోదైంది. ప్రాథమిక విచారణలో భాగంగా.. జంఝార్‌పూర్ అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్‌తో పాటు మధుబని హౌస్‌కీపింగ్ అసిస్టెంట్ ముకేశ్ కుమార్ సింగ్‌లను సస్పెండ్ చేశారు. వీరిద్దరూ రైల్వే లైన్‌ను టెండర్ లేకుండా.. కొందరు వ్యాపారులకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఒకవేళ ఈ కేసులో ఆ ఇద్దరు దోషులుగా తేలితే మాత్రం.. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Earthquake: టర్కీ, సిరియాలలో భారీ భూకంపం.. 100కి పైగా మృతి
మరోవైపు.. ఈ రైల్వే ట్రాక్ దొంగతనం కేసులో ఇప్పటివరకూ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్లే.. అనిల్ యాదవ్, రాహుల్ కుమార్. వీళ్లు తండ్రీకొడుకులు. రాహుల్ కుమార్ మూతపడిన చక్కెర మిల్లులోని స్క్రాప్ కటింగ్ కంపెనీలో మున్షీగా పనిచేసేవాడు. స్క్రాప్ వెలికితీసే పనిని బియాడా అనే కంపెనీకి అప్పగించారు. ఇది నవంబర్ 2022 నుండి స్క్రాప్ తీస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ దొంగలించబడ్డ రైల్వే ట్రాక్ కేసులో హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో.. దొంగలించబడ్డ ఆ ట్రాక్‌లను తిరిగి పొందేందుకు సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నిస్తున్నాయి. రెయిడ్‌లో భాగంగా.. లోహత్ మిల్ పక్కనే ఉన్న బెలాహి గ్రామంలోని ఒక వ్యక్తి ఇంటి నుండి కొన్ని రైల్వే ట్రాక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా.. ఈ సంఘటనకు ముందు బీహార్‌లో రైలు ఇంజన్లు, వంతెనలు, రోడ్లు, మొబైల్ టవర్లు చోరీ అయిన సంగతి తెలిసిందే!
Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి