Graduation Certificate: డిగ్రీ పూర్తయితే విద్యార్థుల ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక డిగ్రీ పట్టా పొందే సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు. డిగ్రీ పట్టా వస్తుందనే సంతోషంలో ఒక విద్యార్థి ఆనందంతో డ్యాన్స్ చేశాడు. అతను డ్యాన్స్ చేసినందుకు కాలేజీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్నాతకోత్సవం వేదికపై డ్యాన్స్ చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టా ఇవ్వడానికి ఆలస్యం చేస్తూ.. విద్యార్థికి క్లాస్ పీకిన తరువాత పట్టాను ప్రధానం చేశారు. ఈ ఘటన ముంబయిలో జరిగింది.
Read also: Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్
తాను గ్రాడుయేషన్ పట్టా అందుకోబోతున్నాననే ఆనందంలో ఓ యువకుడు స్నాతకోత్సవ స్టేజి పైన నృత్యం చేశాడు. దాంతో కళాశాల యాజమాన్యం అతడికి పట్టా ఇవ్వడానికి నిరాకరించారు. చివరికి ఆ విద్యార్థికి క్లాసు పీకి గ్రాడుయేషన్ పట్టాను అందజేశారు. ముంబయిలోని నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఆర్య కొఠారి చదువు పూర్తి చేసుకొన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ కళాశాలలో పట్టా ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్య కొఠారి తన పేరు రాగానే వేదిక ఎక్కి గంతులేశాడు. బోధనా సిబ్బంది వెంటనే వారించడంతో ఆగిపోయాడు. నృత్యం చేయడానికి ఇది సరైన వేదిక కాదని, పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారు. దాంతో ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో చివరికి పట్టా ఇచ్చి పంపించారు. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్య కొఠారి ఇన్‌స్టాలో పోస్టు చేయగా సుమారు కోటి మంది వీక్షించారు. ‘ఇది ఎలా అగౌరవ పరిచినట్లు అవుతుంది? సంతోష సమయాల్లో ఎలా ముడుచుకుని కూర్చుంటారు? ఇతరులతో సంతోషంగా ఉండటం ఎలాగో కొందరు నేర్చుకోవాలని’ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఇలాంటి బోధనా సిబ్బంది అధ్యాపకులకు చెడ్డపేరు తీసుకొస్తారు. మేమే గొప్ప అని భావిస్తూ ఓ పీఠంపై కూర్చోవడం అలవాటు చేసుకున్నారు. సర్, మేడమ్ అంటూ వలసవాద ఆలోచనలో కూరుకుపోయారు. ఆ విద్యార్థి ఎలాంటి తప్పు చేయలేదు. ఒక లెక్చరర్‌గా నేను విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయలేను. కానీ, వారిని తప్పకుండా ప్రోత్సహిస్తానని’ మరో నెటిజన్ విద్యార్థి చర్యను అభినందించాడు. ‘చిన్న స్టెప్పు వేసినందుకు పట్టా ఇవ్వమంటున్నారు.. అయితే అతడు నాకు సర్టిఫికెట్ అవసరం లేదు. కట్టిన ఫీజు వెనక్కు ఇవ్వండి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
