Jaishankar: ఉగ్రవాదం పట్ల భారత్‌కి సహనం తక్కువ అని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం CII వార్షిక వ్యాపార సమ్మిట్ 2024లో జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. వారితో తాము నిరంతరం పోరాడుతున్నామని, గతంలో మన దేశ వైఖరి కారణంగా పొరుగుదేశం యొక్క విపరీతమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నామని, 2014 నుంచి భారత్ సీమాంత్ ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టమైన నిర్ణయం తీసుకుందని జైశంకర్ అన్నారు. ఉరి, బాలాకోట్ వారికి గట్టి సందేశమని చెప్పారు.
Read Also: Rakhi Sawant: టవల్ కట్టుకొని డాన్స్.. స్పృహ తప్పిన నటికి గర్భాశయ ట్యూమర్
పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి చెబితే, భారత ప్రజలు ఆ దేశాన్ని సాధారణ పొరుగువారిలా చూస్తారని అన్నారు. బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందని, అనేక దశాబ్ధాలుగా వారు ఉగ్రవాదాన్ని పరిశ్రమల నడుపుతున్నారని, దానిని మూసేస్తేనే సాధారణ పొరుగు దేశంగా చూస్తామని చెప్పారు. 2019లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇర దేశాల మధ్య సంబంధాలను దిగజార్చిందని అన్నారు.
చైనా గురించి మాట్లాడుతూ.. ఇది మరింత సంక్లిష్టమైందని పేర్కొన్నారు. ఇందులో మూడు కోణాలు ఉన్నాయని, ఒకటి సరిహద్దు ప్రాంతంలో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించడం ప్రాథమిక అంశమని, మీ డ్రాయింగ్ రూంలోకి చొరబడి ఇంటిని చిందరవందరగా చేయడానికి ప్రయత్నిస్తున్న వారితో మీరు వ్యాపారం చేస్తారా..? అని జైశంకర్ ప్రశ్నించారు. భారతదేశ సరిహద్దుల్లో ఏదైనా చేస్తుంటే, వ్యాపారం సాధారణంగా కొనసాగుతుందని మేము చెప్పలేని అన్నారు. రెండో అంశం ‘‘వాణిజ్య సఅమతుల్యత’’ అని అన్నారు. మూడో అంశం జాతీయ భద్రత అని చెప్పారు.