NTV Telugu Site icon

Police Officer House Robbed: ఇంట్లో చోరీ.. బాబా సాయం కోరిన పోలీస్ అధికారి

Police Officer House Robbed

Police Officer House Robbed

Theft in Haryana Police’s house ASI appeared in Baba Darbar to find out: మన ఇళ్లల్లో దొంగతనం జరిగితే పోలీసుల్ని ఆశ్రయిస్తాం. అదే పోలీస్ అధికారుల్లో దొంగతనం జరిగితే.. దొంగలను పట్టుకొని, చీల్చి చెండాడాలి కదా! కానీ, ఒక పోలీస్ అధికారి మాత్రం దొంగలను పట్టుకోవడం మానేసి, ఒక బాబాని ఆశ్రయించాడు. బాబా కాళ్ల వద్ద కూర్చొని.. తన ఇంట్లో కొందరు దొంగలు చోరీకి పాల్పడ్డారని, వారిని పట్టించడంలో సహాయం చేయమని కోరాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Pensions Distribution in Ap: ఏపీలో పెన్షన్ వారోత్సవాలు.. వేగంగా సాగుతున్న పంపిణీ

పానిపట్ జిల్లా చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో డిసెంబర్ 23వ తేదీన చోరీ జరిగింది. కొందరు దొంగలు పక్కా ప్లాన్ వేసుకొని.. ఆయన ఇంట్లో నుంచి 40 తులాల బంగారం, రూ. 3.45 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తన ఇళ్లే చోరీకి గురవ్వడంతో ఖంగుతిన్న ఆ ఏఎస్సై.. తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎలాగైనా ఆ దొంగలను పట్టుకోవాలని, ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు. తన ఇంట్లో దొరికిన సాక్ష్యాల ఆధారంగా, ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎంత ప్రయత్నించినా, దొంగల ఆచూకీ దొరకలేదు.

Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు

దీంతో.. ఆ ఏఎస్సై చేసేదేం లేక చివరికి పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి.. ఆ దొంగల్ని పట్టుకోవడంలో సహాయం చేయాలని కోరారు. అందుకు ఆయన బదులిస్తూ.. ఈ దొంగతనానికి సంబంధించిన సాక్ష్యం మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందని చెప్పాడు. అంతేకాదు.. పంజాబ్ సరిహద్దుల్లో దొంగలు దాక్కున్నారని, అక్కడికి వెళ్తే కచ్ఛితంగా దొరుకుతారని అన్నాడు. అయితే.. ఆ దొంగలు దొరికినా, పోయిన వస్తువులు తిరిగి వస్తాయన్న గ్యారెంటీ లేదని ఆ బాబా చేతులెత్తేశాడు. ఏదేమైనా.. దొంగల కోసం ఒక పోలీస్ అధికారి ఇలా ఒక బాబాని సంప్రదించడం హాట్ టాపిక్‌గా మారింది.

Show comments