Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Planet Parade: జూన్ నెలలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఒకే వరసలోకి ఆరు గ్రహాలు రాబోతున్నాయి. భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే సరళరేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. ‘‘ప్లానెట్ పరేడ్’’ అని పిలిచే ఈ ఖగోళ సంఘటన జూన్ 3న జరగబోతోంది. ఈ ప్లానెటరీ అలైన్మెంట్లో బుధుడు, అంగారకుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ ఉంటాయి.
అయితే, ఈ గ్రహాల అమరికలో రెండు గ్రహాలను మాత్రమే కంటితో చూడగలుగుతాము. కేవలం అంగారకుడు, శని గ్రహాలు మాత్రమే కంటికి కనిపిస్తాయి. యూరెనస్, నెప్ట్యూన్లు భూమికి దూరంగా ఉండటంతో కనిపించవు. సూర్యుడికి దగ్గర ఉన్న గురుడు, బుధుడు మసకగా లేకపోతే పూర్తిగా కనిపించవు. అయితే, శక్తివంతమైన టెలిస్కోపుల సాయంతో వీటిని చూడొచ్చు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
Read Also: Tata Punch: టాటా ‘పంచ్’ అదిరింది.. అమ్మకాల్లో జోరు.. టాప్ 10 కార్లు ఇవే..
నిజానికి ఇలాంటి సంఘటను విశ్వంలో చాలా అరుదు. ప్రతీ ఏడాది అనేక సార్లు ఇలా పలు గ్రహాలు భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళరేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. యూనివర్శిటీ కాలేజ్ లండన్ యొక్క ఫిజిక్స్ & ఖగోళ శాస్త్ర విభాగంలో లెక్చరర్ అయిన కేట్ పాటిల్ ప్రకారం, “గ్రహాల అమరిక” అనేది యాదృచ్చికంగా, అనేక గ్రహాలు సూర్యుడికి ఒకే వైపు ఒకే సమయంలో వచ్చినప్పుడు జరిగే ఖగోళ సంఘటన. మనం భూమి నుంచి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే రేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. గ్రహాలు అసలు ఒకే కక్ష్యలో ఉండవు కానీ మనం భూమిపై చూసినప్పుడు అలా కనిపిస్తాయి. వీటి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్ల ఉంటుంది. ఏప్రిల్ 8, 2024లో చివరిసారి ఇలా పలు పలు గ్రహాలు అమరికలోకి వచ్చాయి. తర్వాత ఆగస్టు 28, 2024లో మరోసారి గ్రహాల అలైన్మెంట్ జరుగుతుంది.
On June 3rd 2024, a very rare event known as the “Parade of Planets” will occur, where six planets will align in a straight line, and it will be visible just before sunrise pic.twitter.com/OAwbkhtQFt
— TheTinderBlog (@TheTinderBlog) May 19, 2024
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!