NTV Telugu Site icon

Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..

Planets

Planets

Planet Parade: జూన్ నెలలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఒకే వరసలోకి ఆరు గ్రహాలు రాబోతున్నాయి. భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే సరళరేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. ‘‘ప్లానెట్ పరేడ్’’ అని పిలిచే ఈ ఖగోళ సంఘటన జూన్ 3న జరగబోతోంది. ఈ ప్లానెటరీ అలైన్మెంట్‌లో బుధుడు, అంగారకుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ ఉంటాయి.

అయితే, ఈ గ్రహాల అమరికలో రెండు గ్రహాలను మాత్రమే కంటితో చూడగలుగుతాము. కేవలం అంగారకుడు, శని గ్రహాలు మాత్రమే కంటికి కనిపిస్తాయి. యూరెనస్, నెప్ట్యూన్‌లు భూమికి దూరంగా ఉండటంతో కనిపించవు. సూర్యుడికి దగ్గర ఉన్న గురుడు, బుధుడు మసకగా లేకపోతే పూర్తిగా కనిపించవు. అయితే, శక్తివంతమైన టెలిస్కోపుల సాయంతో వీటిని చూడొచ్చు.

Read Also: Tata Punch: టాటా ‘పంచ్’ అదిరింది.. అమ్మకాల్లో జోరు.. టాప్ 10 కార్లు ఇవే..

నిజానికి ఇలాంటి సంఘటను విశ్వంలో చాలా అరుదు. ప్రతీ ఏడాది అనేక సార్లు ఇలా పలు గ్రహాలు భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళరేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. యూనివర్శిటీ కాలేజ్ లండన్ యొక్క ఫిజిక్స్ & ఖగోళ శాస్త్ర విభాగంలో లెక్చరర్ అయిన కేట్ పాటిల్ ప్రకారం, “గ్రహాల అమరిక” అనేది యాదృచ్చికంగా, అనేక గ్రహాలు సూర్యుడికి ఒకే వైపు ఒకే సమయంలో వచ్చినప్పుడు జరిగే ఖగోళ సంఘటన. మనం భూమి నుంచి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే రేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. గ్రహాలు అసలు ఒకే కక్ష్యలో ఉండవు కానీ మనం భూమిపై చూసినప్పుడు అలా కనిపిస్తాయి. వీటి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్ల ఉంటుంది. ఏప్రిల్ 8, 2024లో చివరిసారి ఇలా పలు పలు గ్రహాలు అమరికలోకి వచ్చాయి. తర్వాత ఆగస్టు 28, 2024లో మరోసారి గ్రహాల అలైన్‌మెంట్ జరుగుతుంది.