Site icon NTV Telugu

క్రెడిట్‌ కార్డులతోనే పండగల ఖర్చు… ఎన్ని కోట్లంటే?

దసరా, దీపావళి వరుసగా పండుగలతో క్రెడిట్‌ కార్డులను మాములుగా వాడలేదు ప్రజలు ఈ ఫెస్టెవల్స్‌ ఖర్చునంతా క్రెడిట్‌ కార్డుల రూపం లోనే వాడారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌ నెలలో క్రెడిట్‌ కార్డులపై ఖర్చు చేయడం 50శాతం పెరిగింది. నవంబర్‌ తొలివారంలోనూ ఈ జోరు కనిపించింది. సెప్టెంబర్‌ నెలలోనే క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన అక్టోబర్‌, నవంబర్‌లో రికార్డు స్థాయిలకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది.

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) సమాచారం మేరకు క్రెడిట్‌ కార్డులపై ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.1లక్షల కోట్లుగా ఉంది. మార్చిలో నమోదైన రూ.72,300 కోట్ల రికార్డు సెప్టెంబర్లో బద్ధ లైన సంగతి తెల్సిందే. సెప్టెంబర్‌లో కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ పెరి గింది. కొత్తగా పది లక్షల పదివేల క్రెడిట్‌ కార్డులు బ్యాంకింగ్‌లో చేరా యి. కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2,44,000, ఐసీఐసీఐ బ్యాంకు 2,34,000 యాక్సిస్‌ బ్యాంకు 2,00,00 ఎస్‌బీఐ 1,75,000 కొత్త కార్డులను మంజూరు చేశాయి.

క్రెడిట్‌ కార్డు స్పెండింగ్‌లో కొటక్‌ మహీంద్రా బ్యాంకు అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌లో 27శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు 13శాతం వృద్ధి సాధిం చింది. స్పెండింగ్‌ 50 శాతం, వార్షిక ప్రాతిపదికన 75 శాతాన్ని మించి వృద్ధి నమోదైందని యాక్సిస్‌ బ్యాంకు తెలిపింది. పండగ ఆఫర్లతో స్పెండింగ్‌ కోవిడ్‌ ముందు నాటి స్థాయికి చేరుకుందని వెల్లడించింది. ఇక క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల స్పెండింగ్‌ నిష్పత్తి 1.28 రెట్లుగా ఉందని ఐసీఐసీఐ వెల్లడించింది.

Exit mobile version