NTV Telugu Site icon

కంగనా పై వరుణ్‌ గాంధీ ఫైర్‌.. ఏం జరిగిందంటే..?

ఎప్పుడు వార్తల్లో ఉండే కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ఆమె పై ధ్వజమెత్తారు. కంగనా ఎప్పుడు వివాదాలతోనే అంట కాగుతుందన్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆమె పోస్టులు విద్వేష పూరితంగా ఉన్నాయని, వాట్సాప్‌, ట్విట్టర్‌ లాంటి ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు సైతం ఆమెను బ్యాన్‌ చేశారు. అయి తే ఆమెకు తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజే సింది. దీనిపై ఇప్పటికే నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. ఈ కాంట్రవర్సీ క్వీన్‌ పద్మఅవార్డుల ప్రధానం తర్వాత మాట్లాడుతూ దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభు త్వం గుర్తించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని కంగనా ఆ వీడియోలో పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌ చేస్తున్నా అవే మి పట్టించుకోకుండా ఆమె తన మాటలన సమర్థించుకుంటుంది.

అయితే తాజాగా ఇప్పుడు మరో వివాదస్పద వ్యాఖ్యలు చేసింనందుకు బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఆమె పై ఫైర్‌ అయ్యారు. భారత్‌కు అస లైన ఫ్రీడం2014 లో వచ్చిందని, 1947లో లభించింది కేవలం భిక్ష మాత్రమేనని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన వరుణ్‌ దేశ స్వాంతంత్ర్యం కోసం కష్టపడ్డ మహత్మాగాంధీజీ, నేతాజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, భగత్‌సింగ్‌, లక్ష్మీ బాయి, మంగళ్ పాండే, చంద్రశేఖర్‌ ఆజాద్‌, వంటి ఎందరో మహాను భవుల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడాటాన్ని పిచ్చితనం అనాలా? దేశద్రోహం అనాలా అంటూ వరుణ్‌ కంగనరనౌత్‌ పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.