Site icon NTV Telugu

ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు.. భారత్‌లో 1991 కంటే గడ్డు పరిస్థితులు..!

Manmohan Singh

Manmohan Singh

రత్‌లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టున ఘనత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు దక్కింది.. అయితే, అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. 1991 నాటికి భారత్‌లో ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నీ ప్రభుత్వమే చూసుకునేది.. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. ఇక, ఆర్థిక సంస్కరణలు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు డాక్టర్ మన్మోహన్‌ సింగ్.. దేశ ఆర్థిక వ్యవస్థ 1991లో ఎదుర్కొన్న సంక్షోభం కంటే గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలంటే.. ప్రభుత్వం తన ప్రాధమ్యాలను పునర్‌ సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

గత 30ఏళ్లలో వివిధ ప్రభుత్వాల కృషి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగమించిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మన్మోహన్ సింగ్.. ఆర్థిక సంస్కరణల ఫలితంగా సుమారు 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్న ఆయన.. యువతకు కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. సంస్కరణల ద్వారా లభించిన వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుని భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా ఎదిగాయన్నారు మన్మోహన్.. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయయన్నారు.. మరోవైపు.. కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం.. వారి జీవనోపాధికి గండి పడడం బాధాకరమన్న ఆయన.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే.. విద్య, వైద్య రంగాల్లో దేశం ఇంకా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Exit mobile version