మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డాడు మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తి. న్యూయార్క్ నుండి ఈ నెల 9న వచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ ) తెలిపింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణైందని పేర్కొంది.
Read Also:పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్ పొత్తు
కాగా, ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని, అతడు ఇప్పటికే ఫైజర్ మూడు డోసులు తీసుకున్నట్లు పేర్కొంది. అతనితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ అని తేలింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేరినట్లు బీఎంసీ పేర్కొంది. దీంతో వాణిజ్య రాజధానిలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు 15కు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40కి పెరిగాయి.
