Site icon NTV Telugu

ప్రస్తుతం కరోనా అదుపులో ఉంది: మన్సూఖ్‌ మాండవీయ

ప్రస్తుతం కరోనా అదుపులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్‌ మాండవీయ అన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ రాజ్య సభలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ చర్చకు వచ్చింది. అసలు కేసులు ఉన్నాయ అని సభ్యలు ప్రశ్నించారు. ఈ మేరకు రాజ్యా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదని రాజ్యాసభలో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విమానాశ్రాయల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామ‌ని, పాజిటివ్ కేసుల‌కు జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు టెస్టింగ్ ను పెంచాల‌ని అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించిన‌ట్లు మాండ‌వీయ స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌తో ప్రపంచ వ్యాప్తంగా హై రిస్క్‌ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని తెలిపారు.

దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మీటింగ్‌ నిర్వహించామన్నారు. ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ పరీక్షల్లో కూడా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. ఈ విష‌యాన్ని వైద్య నిపుణులు పేర్కొన్నారని మాండవీయ చెప్పారు. ద‌క్షిణాఫ్రికాలో తొలుత క‌నిపించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప‌లు దేశాల‌కు విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే వైద్య శాఖను అప్రమత్తం చేశామన్నారు. వ్యాక్సినేషన్‌లో కూడా వేగం పెంచామని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇంకా రెండు డోసుల టీకాలు వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని, వారు టీకాలు తీసుకునే విధంగా వైద్యాఆరోగ్య శాఖ అప్రమత్తం చేయాలని సూచించామన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్‌పోర్టుల్లోనే ప్రత్యేకంగా టెస్టులు చేస్తున్నామని ఆయన తెలిపారు. వారికి ఇంకా ఒమిక్రాన్‌ లక్షణాలు కన్పించలేదన్నారు. అయినప్పటికీ వారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. జీనోమ్‌ స్వీకెన్సీ ల్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సరిపడే వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని మన్సూఖ్‌ మాండవీయ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సభలో పేర్కొన్నారు. క‌రోనా వేళ టీబీ వ్యాధి టెస్టింగ్ పై తీవ్ర ప్రభావం పడిందా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని వివరణ ఇచ్చారు. 2025 వ‌ర‌కు దేశం నుంచి క్షయ వ్యాధిని నిర్మూలిస్తామ‌నే న‌మ్మకం తమకు ఉందన్నారు.

Exit mobile version