Utter Pradesh: మనిషి చనిపోయిన తరువాత 10 రోజులకు లేదా 11 రోజులకు పెద్దకర్మ నిర్వహిస్తారు. అది కూడా మరణించిన వారి కుమారులు నిర్వహిస్తారు. చనిపోయిన వ్యక్తికి కుమారులు లేకపోతే కుమార్తెలు చేస్తారు.. వారు కూడా ఏకపోతే.. వారి అన్నతమ్ములు చేస్తారు. కానీ తను చనిపోయిన తరువాత తన పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో లేదో అన్న సందేహంతో ఒక వృద్దుడు తనకు తానుగా పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు.300 మందికి సరిపడా ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేశాడు. అదేంటీ అనుకుంటున్నారా? ఇది నిజం.. ఈ ఘటన ఉత్తర్ ప్రేదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది.
Read also: Ashu Reddy : స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్న అషు రెడ్డి..
ఉత్తర్ ప్రేదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన 59 ఏళ్ల జఠాశంకర్ తాను బ్రతికుండగానే తన పెద్దకర్మన నిర్వహించుకున్నాడు. అంతేకాదు మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా తన సమాధిని కూడా నిర్మింప చేసుకున్నాడట. తాను చనిపోయి తరువాత తనను అదే సమాధిలో పాతిపెట్టమని తన కుటుంబ సభ్యులను కోరాడు. కొద్ది వారాల క్రితం తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాడట. ఈ కార్యక్రమం అనంతరం తన పెద్దకర్మకు రావల్సింది గ్రామస్తులందరినీ ఆహ్వానించాడు. గురువారం రాత్రి తన పెద్దకర్మను పూర్తి చేశాడట. ఈ కార్యక్రమానికి జఠా శంకర్ బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు అతను ఆహ్వానించిన గ్రామస్తులతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా హాజరైనట్టు తెలిసింది. అతడు సుమారు 300 మందికి విందున ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
Read also: Monsoon: ఏపీకి చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇక వర్షాలే..
59 ఏళ్ల జఠాశంకర్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతడికి ఏడుగురు సంతానం ఉన్నారు. అయితే తాను చనిపోయిన తరువాత తన పెద్దకర్మ కార్యక్రమాన్ని తన పిల్లలు, కుటుంబ సభ్యులు జరిపిస్తారో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. అందుకోసం వారిపై ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదని చెప్పాడు. అందుకే తాను బతికి ఉన్నపుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు శంకర్ తెలిపాడు. ఇందుకు తన పిల్లలు, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. మరణానికి ముందు ఈ కార్యక్రమం చేయడం మన ఆచారాల్లో భాగం కాదు.. కానీ నేను నిర్వహించుకున్నాను.. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని జఠా శంకర్ చెప్పాడు.