పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆయన బీజేపీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ఈ కూటమిలో మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని SAD (డెమోక్రటిక్) వంటి ఇతర పార్టీలు చేరే అవకాశం ఉంది. బీజేపీ పంజాబ్ ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల మొదట్లో చండీగఢ్‌లో ఇరువురు నేతల భేటీ తర్వాత ఇది రెండోసారి. సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలను తగిన సమయంలో ప్రకటిస్తామని షెకావత్ తెలిపారు.
ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా 101 శాతం విజయం సాధిస్తుందని సింగ్ అన్నారు. అమరిందర్‌సింగ్, షెకావత్ నివాసం నుండి బయలుదేరిన వెంటనే, మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ (డెమోక్రటిక్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా బీజేపీ పంజాబ్ ఇన్‌ఛార్జ్‌ని కలవడానికి వచ్చారు. ధిండాకు చెందిన SAD (డెమోక్రటిక్) కూడా కూటమిలో భాగమవుతుందని వర్గాలు తెలిపాయి.
Read Also: బీసీసీఐ-కోహ్లీ మధ్య ముదురుతున్న వివాదం…
మరికొన్ని చిన్న పార్టీలు కూడా చేరే అవకాశం ఉందన్నారు. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీ లో SAD జూనియర్ భాగస్వామిగా 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినప్పటికీ, బీజేపీ ఈసారి సగానికి పైగా సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. పంజాబ్‌లో ఎన్నికలు పంచముఖ పోరుగా మారబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్‌ఎడీ, ఆప్‌తో పాటు వివిధ రైతు సంఘాలు కూడా రంగంలోకి దిగవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అమరీందర్ సింగ్‌తో పొత్తుతో సిక్కులు మెజార్టీగా ఉన్న రాష్ర్టంలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది.
