Site icon NTV Telugu

కేరళ పోలీసులకు సోలార్‌ గొడుగులు

ఎండైనా, వానైనా, మంచైనా … ట్రాఫిక్‌ పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మండుటెండల్లో, వడగాల్పుల్లో గంటల తరబడి నిల్చొని విధులను నిర్వహించడం ట్రాఫిక్‌ పోలీసులకు చాలా ఇబ్బంది. వీరి కష్టాలను గమనించిన కేరళ ప్రభుత్వం… కొన్ని ప్రత్యేక సదుపాయాలతో సౌర గొడుగులను అందిస్తోంది. కేవలం తలకు చల్లదనాన్ని ఇవ్వడమేకాదు.. ఈ గొడుగుల్లో ఫ్యాన్‌, మంచినీటి బాటిల్‌ పెట్టుకునే స్టాండ్‌ , గొడుగుతోపాటు కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైటు ఏర్పాటుచేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Read Also: సోషల్‌మీడియా సాయంతో ఆర్టీసీ సమస్యలకు చెక్‌

ఇవన్నీ సౌరశక్తి ఆధారంగా పనిచేస్తాయి. గొడుగు పైభాగాన సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. కిందిభాగంలో బ్యాటరీ ఉంచారు. ముందుగా కేరళ పోలీసు విభాగం కొచ్చి జిల్లా ఎర్నాకుళం నగరంలో ఇలాంటి అయిదు గొడుగులను ఏర్పాటు చేశారు. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే.. ఇతర జిల్లాల పోలీసులకు కూడా ఈ గొడులను అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Exit mobile version