Site icon NTV Telugu

UtterPradesh: కాబోయే అత్త చేసిన పనికి .. షాకిచ్చిన వరుడు.. ఏమీ చేశాడంటే?

Utterpradesh

Utterpradesh

UtterPradesh: పెళ్లి అంటే హడావుడి అంతా.. ఇంతా కాదు. పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకోవాలంటారు.. కానీ ప్రస్తుత రాకెట్‌ యుగంలో అంత సీన్‌ లేదంటున్నారు యువత. ఇలా స్మార్ట్ ఫోన్‌ ద్వారా పరిచయం.. ఆ తరువాత కాఫీ షాప్‌లో మీటింగ్‌.. ఆ తరువాత పెళ్లి. ఇలా జరుగుతున్నాయి. అయితే అన్ని పెళ్లిల్లు ఇలానే జరుగుతున్నాయని కాదు.. ఇప్పటికే 70 నుంచి 80 శాతం పెళ్లిళ్లను ఇంటి పెద్దలు కుదర్చి చేస్తున్నారు. అలాంటి పెళ్లిలో జరిగిన ఘటనలో తనకు కాబోయే అత్త చేసిన పనికి వరుడు షాకిచ్చాడు.. అదేంటంటే..

Read also: Alcohol: రోజూ మందు తాగుతున్నారా..? అయితే మీ లివర్ రిస్క్‌లో ఉన్నట్లే..

అక్కడ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కుమారుడు వచ్చి మండపంలో కూర్చున్నాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకురమ్మని.. పంతులు సూచించాడు. దీంతో వధువును ఆమె కుటుంబ సభ్యులు ధూమ్ ధామ్‌గా సందడి చేసుకుంటూ మండపానికి తీసుకువస్తున్నారు. వధువు వెంట ఆమె తల్లి కూడా వచ్చింది. ఈ క్రమంలోనే వధువుతో వచ్చే వారు మేళ తాళాలు, డ్యాన్స్‌లతో ఆమెను పెళ్లి మండపం వైపు తీసుకువస్తున్నారు. అదే సమయంలో పెళ్లి కుమార్తె తల్లి.. చేతిలో సిగరెట్ పట్టుకుని కాల్చుకుంటూ చిందులు వేసింది. అది చూసిన వరుడు షాక్ అయ్యాడు. దీంతో తాను ఈ పెళ్లి చేసుకోనని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Read also: Pawan Kalyan Bro Movie: ‘బ్రో ది అవతార్’ టిక్కెట్ రేటు పెంచనున్న ఏపీ సర్కార్?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్‌పురకు చెందిన వధువుకు.. జూన్ 27న వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపానికి వధువు, వరుని బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారు. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ పూర్త్యయాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో వరుడు పెళ్లి పీటలపై కూర్చున్నాడు. అదే సమయంలో పెళ్లి కుమార్తెను కూడా తీసుకురావాలని పురోహితుడు సూచించాడు. దీంతో వధువు తరపున బంధువులు ఊరేగింపుగా వచ్చారు. వధువు పల్లకి ముందు ఆమె తల్లి సిగరెట్ కాలుస్తూ.. డ్యాన్సులు చేస్తూ ఉంది. వధువు కోసం పీటల మీద వేచి ఉన్న వరుడు అత్త సిగరెట్ కాలుస్తూ.. డ్యాన్స్ చేయడం చూసి షాక్‌కు గురయ్యాడు. సభ్యత, సంప్రదాయం లేకుండా సిగరెట్‌ తాగడమేమిటని ఆగ్రహించిన పెండ్లి కొడుకు వెంటనే వేడుకను నిలిపివేయించి పెళ్లిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి నిష్క్రమించాడు. ఆ తరువాత గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి వరుడికి నచ్చజెప్పడంతో వివాహానికి ఒప్పుకున్నాడు.

Exit mobile version